రైతు సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని మల్కారంలో రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యం 1. 75 కోట్లతో నిర్మించనున్న గోదాముకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. గతంలో ఏ సర్కార్ అందించని విధంగా రైతుబంధు, రైతుబీ మాతో పాటు రుణమాఫీని అందజేస్తోందన్నారు. గతంలో ఏమీ చేయని ప్రభుత్వాలు ఇప్పుడు రైతులను అడ్డం పెట్టుకుని ఏవేవో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. అనంతరం చిన్న గోల్కొండ పరిధిలోని సంఘిగూడలో డ్వాక్రా భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జెడ్పీటీసీ తన్వీ, మత్కారం చిన్న గోల్కొండ గ్రామ సర్పంచులు మాధవి, పద్మావతి, పీఏసీఎస్ చైర్మన్ బి. సతీష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె. చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

courtesy:https://telugu.suryaa.com/telangana-news-440821-.html


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox