అమెరికాలో మరోసారి కాల్పుల .. ముగ్గురు మృతి

ఒక టెక్సాస్‌ ఘటనలోనే 22 మంది మృతి

హైదరాబాద్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దేశంలో రోజు రోజుకు గన్‌కల్చర్‌ పెరిగిపోతుంది. ఏదో ఒక ప్రాంతంలో క్రమం తప్పకుండా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ మేరీల్యాండ్‌లోని  స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు తుపాకీతో హల్‌చల్ చేశాడు. ఈ ఘటనలో  ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతరం అక్కడి చేరుకున్న పోలీసులు దుండగుడిపై కాల్పులు జరిపారు.  అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో నానాటికీ తుపాకీ పెలుళ్ళు అధికమవుతుండడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే న్యూయార్క్‌, టెక్సాస్‌, ఓక్లహోమాలో జరిగిన కాల్పుల్లో రెండంకెల సంఖ్యలో ప్రజలు మరణించారు.  ఒక టెక్సాస్‌ ఘటనలోనే 22 మంది మరణించారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం