వివాదాస్పద వ్యాఖ్యలపై సాయిపల్లవి స్పందించిన సాయి పల్లవి

నా వ్యాఖ్యలకు త్వరలో సమాధానం చెబుతానని వ్యాఖ్య

విశాఖపట్టణం: విరాట పర్వం ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కొందరు ఆమెపై కేసులు పెట్టే వరకు వెళ్లారు. సోషల్ మీడియాలో ఆమెపై బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది. విశాఖపట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ‘‘ నా వ్యాఖ్యలకు సమాధానం చెబుతాను.. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా.. అది సినిమా ప్రమోషన్ కోసం అనుకుంటారు. అయితే ఈ వివాదం నుండి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు చూస్తున్నారు . ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంతో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదం గురించి మాట్లాడతాను..’’ అన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox