పారదర్శకంగా 157 మంది పోలీసు సిబ్బంది బదిలీలు

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి

అనంతపురం జిల్లా: పారదర్శకంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలు నిర్వహించినట్లు   జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. మొత్తం 127 మంది కానిస్టేబుళ్లు, 30 మంది పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం బదిలీ చేసి అక్కడికక్కడే డిఓ కాపీలు అందజేశామన్నారు. 

ఒకే చోట ఐదేళ్లు పూర్తీ చేసుకున్న పోలీసు సిబ్బంది సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్‌ పై ప్రదర్శింపజేసి సీనియార్టీ ప్రకారం కౌన్సెలింగ్ లో అవకాశం కల్పించి బదిలీ ప్రక్రియ జరిగిందన్నారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా బదిలీల ప్రక్రియ యావత్తు పారదర్శకంగా నిర్వహించడంతో పోలీసు సిబ్బంది నుండీ హర్షం వ్యక్తం చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రాంమోహనరావు, నాగేంద్రుడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, శివప్రసాద్ , జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం