24 ఏళ్ల తర్వాత వారికి ఉద్యోగాలు...1998 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త

సీఎం జగన్ సంతకంతో త్వరలో పోస్టింగులు

అమరావతి: 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాల ప్రక్రియ నిలిచిపోయిన వారికి జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయినవారికి  పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారు. 1998 అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే ఫైలుపై సీఎం జగన్‌ సంతకం చేశారు. నాటి డీఎస్సీలో దాదాపు 4,534 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయారు.

అప్పటి నుంచీ వారు ఉద్యోగాల కోసం పోరాడుతునే ఉన్నారు. వారిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు .  కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం కల్పిస్తూ దస్త్రంపై సీఎం సంతకం చేశారు. వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేలు (రూ.33 వేలు) ను వర్తింపజేయనున్నారు. సీఎం సంతకంతో 24 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ రాసిన అభ్యర్థుల నియామకాలు 24 ఏళ్లుగా కోర్టు కేసులు, ఇతర సమస్యలతో పెండింగ్‌లోనే ఉన్నాయి.

వీటిపై ఏళ్లుగా అభ్యర్థులు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రుల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. తాజాగా సీఎంవో అనుమతి లభించడంతో త్వరలో వారికి పోస్టింగులు లభించనున్నాయి. ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసిందని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, పీఆర్టీయూ, ఏపీయూఎస్‌ తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆనందం  వ్యక్తం చేశాయి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం