ఐదో టీ20 రద్దు.. సిరీస్ డ్రా

భారత్‌ స్కోరు 28/2.. వర్షంతో మ్యాచ్ రద్దు

హైదరాబాద్: అనుకున్నట్లే జరిగింది వర్షం పడింది ఫలితంగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌ రద్దయ్యింది. దీంతో సిరీస్ 2-2తో డ్రా తో ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడుతుండడం వల్ల మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. టాస్‌ తర్వాత ఒక్క బంతి కూడా పడకముందే వర్షం మొదలైంది. ఆటగాలంతా డ్రెసింగ్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. వర్షం జోరుగా పడడంతో  మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని  ఉత్కంఠ నెలకొంది.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం వల్ల మ్యాచ్​ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనందున.. 19 ఓవర్లకే ఆటను కుదించినట్లు అధికారులు ప్రకటించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు వచ్చారు. రెండు సిక్సర్లు కొట్టి  ఊపు మీద కనిపించిన ఇషాన్‌ (15)ను ఎంగిడి పెవిలియన్‌ పంపాడు. మరో ఓపెనర్ రుతురాజ్‌ (10)ని కూడా ఎంగిడియే ఔట్‌ చేశాడు. 3.3 ఓవర్ల ఆట పూర్తయిన తరువాత మళ్లీ వర్షం ప్రారంభం అయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికి భారత్‌ స్కోరు 28/2గా ఉంది. మరి చేసేదేమి లేక బీసీసీఐ మ్యాచ్​ను రద్దు చేసింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం