విడాకులు తీసుకుంటున్న మరో బిలియనీర్ జంట

ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని సెర్గీ బ్రిన్ వెల్లడి

హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వివహా బంధానికి ముగింపు పలకబోతున్నారు. మూడేళ్లుగా దాంపత్య జీవితం పంచుకుంటున్న భార్య నికోలే షనాహన్‌ నుంచి విడాకులు కోరుతూ దరఖాస్తు చేశారు. దీని కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి మధ్య  విబేధాలు ఉన్నాయని సెర్గీ బ్రిన్  పేర్కొన్నట్టు కోర్ట్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. అయితే బహిష్కృతమైన విడాకుల విషయాన్ని రహస్యంగా ఉంచాలని, కోర్ట్ పత్రాలకు సీల్ వేయాలని కోర్టుకి సెర్గీ విజ్ఞప్తి చేశారు.  కాగా సెర్గీ బ్రిన్ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. 

సెర్గీ బ్రిన్ ఇంతకుముందు అన్నె వొజ్కీకీ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2015లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తీసుకున్న బిలియనీర్లు సంఖ్య పెరుగుతుంది. తాజాగా బిల్‌గేట్స్-మిలిందా గేట్స్ విడాకులు తీసుకోగా.. అంతకు మూడేళ్ల క్రితం  జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్‌లు విడిపోయారు. ఇప్పుడు ఆ జాబితాలో సెర్గీ బ్రిన్-నికోలే షనాహన్‌ చేరబోతున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం