వైసీపీకి(YCP) చరమగీతం పాడాలి: నరసింహారావు

నెల్లూరులో భాజపా రోడ్ షో

నెల్లూరు: Nellore జిల్లా ఆత్మకూరులో బీజేపీ(BJP) భారీ రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(GVL Narasimharao) మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో నిలిపి చిత్తశుద్ధి చాటుకుందన్నారు. ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని.. మూడేళ్ళ పాలనలో రైతులకు అన్యాయం చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించలేదన్నారు. వైసీపీ(YCP)కి చరమగీతం పాడాలన్నారు. బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని జీవీఎల్ వెల్లడించారు.
    

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం