రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

ఉప్పొంగిన ఈసీ, మూసీ నదులు

హైదరాబాద్: జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వాన దంచి కొట్టింది. ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. వరదలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేవెళ్ల మండలం తంగేడుపల్లి వద్ద వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox