కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి(Singer Chinmayi)

జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అనే క్యాప్షన్‌తో ఫోటోలు షేర్ చేసిన భర్త రాహుల్

హైదరాబాద్: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినారు. మంగళవారం రాత్రి ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘‘ద్రిప్త ఆండ్ శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చారు, ఇక వారు జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోలను షేర్ చేశారు. రాహుల్‌ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వారకి శుభాకాంక్షలు చెబుతున్నారు. సీని పరిశ్రమలో వేర్వేరు విభాగాల్లో వీరికి కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ విషయం ఇరు కుటుంబాల్లో చెప్పి పెద్దల అంగీకారంతో 2014లో  మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox