నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు: టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్

జూన్ 21 సాల్ స్టిస్ (ఉత్తరాయణం) సందర్భంగా సందీప్ కుమార్ మఖ్తల, శాస్త్రవేత్త రఘునందన్ పరిశీలన

మక్తల్: మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం ముడుమాల్ వద్ద ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 21 సమ్మర్ సాల్ స్టిస్ సందర్భంగా నిలువురాళ్ల వద్ద ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తో కలిసి సూర్యుడి గమన దిశలను పరిశీలించారు

జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ... ఆర్బిట్ 2022 లో భాగంగా నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా మార్చి 20, 21వ తేదీన ఈక్వినాక్స్ పరిశీలించగా తాజాగా రెండో అడుగులో భాగంగా.. జూన్ 21 సాల్ట్ సిస్.. అనగా లాంగెస్ట్ డే.. పగలు ఎక్కువ ఉన్న రోజు అని అర్థం. ఈ రోజున నిలువురాళ్ల వద్ద సూర్యుని గమన దిశలు ఇతరత్రా నమోదు చేసుకోవడం జరిగిందని, యునెస్కో గుర్తింపు కోసం కీలకమైన  డాక్యుమెంటేషన్ కోసం ఈ వివరాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మఖ్తల్ లోని మన పూర్వీకులు ఎటువంటి టెలీస్కోప్, ఇతర పరికరాలు లేకుండా వాతావరణ మార్పులను నిలువురాళ్ల నుండి తెలుసుకునేవారని, టెక్నాలజీలో మన మఖ్తల్ వేల సంవత్సరాలనుండే ఎంతో ముందుంది అనటానికి నిలువురాళ్ల ఒక నిదర్శనమని సందీప్ మఖ్తల అన్నారు. 

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ.. 3500 సంవత్సరాల క్రితం అప్పటి ఆదిమానవులు ప్రస్తుతమున్న టెలిస్కోప్, శాటిలైట్లలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా  సూర్యగమనం వాతావరణ దిశలను తెలుసుకునే వారన్నారు. నిలువురాళ్ల ను పోలిన నిర్మాణం ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంజ్ ఉంటుందని అన్నారు. సంవత్సరంలోని నాలుగు ప్రత్యేకమైన రోజులు మార్చి 20(ఈక్వినాక్స్), జూన్ 21 (సాల్ట్ సిస్), సెప్టెంబర్ 23 (ఈక్వినాక్స్) , డిసెంబర్ 22 (సాల్ట్ సిస్) రోజుల్లో సూర్యుడి గమన దిశలను రికార్డు చేయడం జరుగుతుందని యునెస్కో గుర్తింపు కోసం ఇవి ఎంతో కీలకమని తెలిపారు. నిలువురాళ్లను చూడాలనుకునేవారు 4 ప్రత్యేకమైన రోజులలో వచ్చి.. సూర్యుడి గమన దిశలను చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈక్వినాక్స్ మార్చి 20, సెప్టెంబర్ 23న ఆరోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయని జూన్ 21 సాల్ట్ సిస్ లాంగెస్ట్ డే... అనగా పగలు ఎక్కువ ఉండే రోజు డిసెంబర్ 22 సాల్ట్ సిస్ లాంగెస్ట్ నైట్ అనగా రాత్రి ఎక్కువ ఉండే రోజు అని తెలిపారు. 

సంవత్సర కాలంలోని నాలుగు ప్రత్యేకమైన రోజుల్లో జరిగే మార్పులను గుర్తించి, యునెస్కో గుర్తింపు కోసం డాసియర్ రూపకల్పన చేసి, నిలువు రాళ్లకు ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా అంతర్జాతీయ ఖ్యాతిగా తీసుకురావడమే తన లక్ష్యమని జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జై మఖ్తల్ ట్రస్ట్ ప్రతినిధులు ఇలియాజ్, లక్ష్మీ, బస్వరాజు, తరుణ్, ప్రదీప్, ప్రమోద్, శ్యామ్, లింగప్ప, ఆనంద్ లతోపాటు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox