"మన బస్తి-మన బడి" కార్యక్రమం ఫలితాలు అద్భుతంగా ఉంటాయి: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

శాయంపేట పాఠశాలను సందర్శించిన దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రొఫెసర్ జయశంకర్ మన బస్తి-మన బడి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. ఆయన గతంలో శాయంపేట ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. పాఠశాల సందర్శన అనంతరం మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 16 లక్షల నిధులతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో "మన బస్తి-మన బడి" కార్యక్రమం యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, అవి భవిష్యత్ తరాలకు అందుతాయని తెలిపారు.

ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ సాధించిన ముగ్గురు విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి వారికి త్వరలోనే తన తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాఠశాలకు స్థలం ఎక్కువ ఉన్నందున "కిచెన్ గార్డెన్" ఆలోచన తప్పకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించి ఉన్నతమైన చదువులు చదివి మంచి స్థానాల్లో ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థిలకు నోట్ పుస్తకాలను అందజేసి వారితో కలిసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రాజు, కూడా డైరెక్టర్ శివశంకర్, ప్రధానోపాధ్యాయులు వేదాంత చారి, స్వామిలు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం