International Olympic Day 2022: నేడు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం.. థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం యొక్క థీమ్ 'కలిసి, శాంతియుత ప్రపంచం కోసం.  క్రీడలు, ఆరోగ్యం అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజును జరుపుకుంటారు. క్రీడల ప్రాముఖ్యత. అది  జీవితాన్ని ఎలా మార్చగలదో తెలపడమే ఈ రోజు లక్ష్యం. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి, ఇందులో ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్లు పాల్గొంటారు.

అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం చరిత్ర: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
23 జూన్ 1894న, ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి, ప్రోత్సహించడంలో భాగంగా 1894లో సోర్బోన్ (పారిస్)లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్థాపించబడింది. IOC సభ్యుడు డాక్టర్ గ్రస్ స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 41వ సీజన్‌లో ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం గురించి ఆలోచన చేశారు. కొన్ని నెలల తర్వాత, జనవరి 1948లో, స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్‌లో జరిగిన 42వ IOC సెషన్‌లో ప్రాజెక్ట్ ఆమోదించబడింది. దీని తరువాత, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని మొదటిసారిగా 23 జూన్ 1948న జరుపుకున్నారు. జాతీయ ఒలింపిక్ కమిటీలు ఈవెంట్‌కు బాధ్యత వహించాయి.

అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత: 

వయస్సు, లింగం, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రీడలతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం. ఇది శారీరక వ్యాయామం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదనంగా, ఒలింపిక్ క్రీడల గురించి ప్రదర్శనలు మరియు విద్యా సదస్సులు కూడా నిర్వహించబడతాయి.

రెండు దశాబ్దాలకు పైగా, జాతీయ ఒలింపిక్ కమిటీలు (NOCలు) 150 దేశాలలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ డే పరుగులను నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాల్లో, పాఠశాలలు ఈ రోజును క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి.  ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం థీమ్ 'కలిసి, శాంతియుత ప్రపంచం కోసం'. ఇది ప్రజలను శాంతితో ఒకచోట చేర్చే క్రీడ సంగ్రామం. ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా #MoveForPeace. #OlympicDay ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఈ ఒలింపిక్ డే స్పూర్తిని తెలియజేస్తున్నారు. 

ఒలింపిక్ క్రీడల తేదీ: 2024, 2026లో జరిగే ఆటలు తదుపరి  ఒలింపిక్ క్రీడలు (వేసవి ఒలింపిక్ క్రీడలు 2024) జూలై 26 నుండి ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతాయి, ఇది 11 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, తదుపరి వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026 ఇటలీలోని మిలన్ మరియు కోర్టినా డి'అంపెజ్జోలో జరుగుతాయి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం