వితంతువుపై వివక్ష ఎందుకు. వారికి జీవించే హక్కు ఉంది

న్నచూపుకు గురవుతున్న వితంతువులకు అండగా ఉండాలనే స్పూర్తితోనే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం

ఈ ప్రపంచంలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది. కానీ ఈ సమాజంలో అందరికి సమానత్వం లేకుండా పోయింది. చాలా మంది వివక్షకు గురవుతున్నారు. ముఖ్యంగా వితంతువులు.  ప్రతి ఒక్కరూ తమ వివాహ బంధాన్ని కలకలం కొనసాగాలని ఆశతో బతుకుతారు. అయితే వివాహం తరువాత, వారి భాగస్వామి ఏదో ఒక వ్యాధి లేదా మరేదైనా కారణం వల్ల ఈ లోకానికి వీడ్కోలు పలుకడం చాలా మంది మహిళలను దుఃఖ సాగరంలో ముంచుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా వితంతువులు ఏదో ఒక రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో గృహ బహిష్కరణ, గృహ హింస, వివక్ష, పేదరికం వంటి  సమస్యల వలయంలో చిక్కుకొని బతుకుబండి లాగుతున్నారు. చిన్నచూపుకు గురవుతున్న వితంతువులకు అండగా ఉండాలనే స్పూర్తితో ఐక్యరాజ్య సమితి 2011 జూన్‌ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ప్రకటించింది 

అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా వితంతువులైన మహిళల స్థితిని మెరుగుపరచడం ద్వారా వారు అందరిలాగానే సాధారణ జీవితాన్ని గడపేలా చేయడం.  సమాన హక్కులు పొందేలా చూడడం. సమాజం ఎంత పురోగతి సాధించినా, వితంతువును ఇప్పటికీ సమానంగా చూడలేకపోతున్నారు. పలు నివేదికల ప్రకారం, భారతదేశంలో నాలుగు కోట్లకు పైగా వితంతు మహిళలు ఉన్నారు. వారికి సహాయం, సమానత్వం మొదలైనవి అవసరం. నేటికీ, వితంతు స్త్రీలు తమ హక్కులను కోల్పోతున్నారు,  

వితంతువులు కూడా అందరి మాదిరిగానే సమాజ హోదాను పొందలే చేయడం సమాజం యొక్క బాధ్యత. అటువంటి పరిస్థితిలో, వారిని  గౌరవించడానికి ప్రతి సంవత్సరం జూన్ 23 న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రసుత్తం భారత్‌లో సుమారు నాలుగున్నర కోట్ల వితంతువులు ఆధరణ నోచుకోకుండ, ఆత్మాభిమానం కోల్పోయి బతుకుతున్నారు.  పండుగల్లో, కుటుంబ శుభకార్యాలలో వివక్షత గురవుతున్నారు. కన్నబిడ్డ వివాహాల్లో సమయంలో వారిని మనస్పుర్తిగా ఆశీర్వదించలేకు కుమిలిపోతున్నారు. అందరూ మహిళలలాగా ముస్తాబు కాలేక సాధారణ బట్టలు వేసుకోలేక యువ వితంతువులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

ప్రభుత్వాలతోపాటు, అందరు వితంతువులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దీంతో ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చి సమాజం మార్పు చెందుతుంది. ఈ వితంతు వివక్షా విముక్తి ఉద్యమంలో భాగస్వాములై  అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఆత్మగౌరవంగా జీవించే హక్కు కల్పిద్దాం . వితంతువు స్త్రీలు కూడా మన సమాజంలో, దేశంలో ఒక భాగమనే విషయాన్ని ఎవరూ మరచిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారిని గౌరవించాలి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం