ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మారిన పే స్కేల్‌

జూలై 1 నుంచి ఆర్టీసీ(RTC) ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జూలై 1 నుంచి ఆర్టీసీ(RTC) ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ఆర్టీసీ(RTC)ని 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. అయితే ఇన్నాళ్ళు కార్పొరేషన్‌ పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లించిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు చెల్లించనుంది. ఆమేరకు నూతన పే స్కేల్‌ను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తామని తెలిపింది. 

తాజా పీఆర్సీ మేరకు ఏడాది కాలానికి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించి అమలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం ఉండనుంది. ప్రధానంగా అత్యధిక సంఖ్యలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సాధారణ, కిందిస్థాయి సిబ్బందికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆర్టీసీ(RTC) అధికారులు చెబుతున్నాయి.  రాష్ట్ర ప్రధాన కేంద్రం విజయవాడలో పనిచేసే ఉద్యోగులందరికీ అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. దాదాపు 200 మంది ఉద్యోగులకే అదనపు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నారు. వారితో పాటు విజయవాడలో పనిచేసే అందరికీ ఆ విధంగానే చెల్లించనున్నారు. దీనివల్ల దాదాపు 500మందికి మరింత ప్రయోజనం కలగనుంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం