పోలియో వైరస్‌(Polio Virus) కొత్త టైప్‌ గుర్తింపు. ఆందళోనలో డబ్ల్యూహెచ్‌వో

కొత్త వేరియెంట్‌ రూపంలో పోలియో వ్యాప్తి

హైదరాబాద్: ఇక పీడ విరగడ అయిపోయింది అనుకున్న పోలియో వైరస్‌(Polio Virus).. కొత్త వేరియెంట్‌ రూపంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.  పోలియో వైరస్‌(Polio Virus)లో వీడీపీవీ2 రకాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన కేసులేవీ అధికారికంగా నమోదు కాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. 

లండన్‌లోని మురుగు నీటి నమునాలో ఈ కొత్త వేరియెంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రస్తుతానికి ఈ వేరియెంట్‌ బారిన పడిన ఏ కేసు నమోదు కాలేదు. ‘‘ఈ వైరస్‌ను పర్యావరణ నమూనాలలోమాత్రమే గుర్తించం. దీనిని సంబంధిత కేసులు ఏవీ కనుగొనబడలేదు" అని ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది . అయితే పోలియో వైరస్‌(Polio Virus) ఏ టైప్‌ వేరియెంట్‌లో ఉన్నా పిల్లలకు ప్రమాదమేన’’ని హెచ్చరించింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox