హైదరాబాద్: హైపర్ టెన్షన్ కారణంగానే 10 శాతానికి పైగా ప్రజలు గుండె జబ్బులకు గురవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు పరిశోధనల్లో తెలింది. అలాగే టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం.
గుర్తించటం ఎలా?
బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు తలదిమ్ముగా ఉంటుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం వంటివి చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి?
- వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి
- సరిగ్గా మందుల వాడకం ఉండాలి
- ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడాలి
- షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి
- కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి
- మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి
- కారం, ఉప్పు తగ్గించాలి

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox