ఈ అస్సాం టీ (Assam Tea) కేజీ లక్ష రూపాయలు

టీ ప్రియులు మాత్రం లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీని తాగడానికి సిద్ధం

హైదరాబాద్: కేజీ టీ పోడి లక్ష రూపాయలు అంటే నమ్ముతారా ? ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ టీ ప్రియులు మాత్రం లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీని తాగడానికి సిద్ధంగా ఉన్నారు. టీ తోటలకు అస్సాం ప్రసిద్ధి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన పభోజన్ గోల్డ్ టీ అనే అరుదైన ఆర్గానిక్ టీని జోర్హాట్‌లోని వేలంలో కిలో రూ.లక్ష చొప్పున విక్రయించారు, అస్సాంకు చెందిన టీ బ్రాండ్ పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ ఈ టీని కొనుగోలు చేసిందని జోర్హాట్ టీ వేలం కేంద్రం (జేటీఏసీ) అధికారి తెలిపారు.

స్పెషాలిటీ ఏంటి?         
పభోజన్ గోల్డ్ టీ రుచికరంగా.. అద్భుతమైన అరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. టీ తోటల రెండవ బ్యాచ్. యొక్క పై ఆకులను తీసి దీనిని తయారు చేస్తారు. ఈ ఆకులు తీపి ఎండ బెట్టిన తరువాత బంగారు రంగులోకి మారుతాయి. ఈ టీ వెరైటీ చాలా అరుదు. ఈ టీకి ప్రపంచవ్యాప్తంగాటీ ఫ్యాన్స్ ఉన్నారు.  సేంద్రియంతో ఈ అరుదైన టీని ఉత్పత్తి అవుతుంది. ఈ టీ ప్రత్యేక రుచి, దీని విలువను ఇష్టపడే కొనుగోలుదార్లు అంతర్జాతీయంగా ఉన్నారని సంస్థ పేర్కొంది. ఈ టీ ప్రత్యేక రుచికి రూ.లక్షనిచ్చి ఇష్టపడి కొనుగోలు చేశారంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉంటుంది.  'పభోజన్‌ గోల్డ్‌ టీ' మాత్రం అత్యధిక రేటు పలికి రికార్డు సృష్టించింది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox