అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో భారీ భూకంపం(Earthquake).. తాజా అప్‌డెట్

సుమారుగా 1000 మందిపైగా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలు

కాబుల్: అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో బుధవారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. తూర్పు అఫ్గానిస్థాన్‌(Afghanistan)లోని ఖోస్త్‌ ప్రావిన్సులో  పెను విధ్వంసం సృష్టించింది. సుమారుగా 1000 మందిపైగా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వార్తా సంస్థ ‘బక్తర్‌ న్యూస్‌ ఏజెన్సీ’ ప్రకటించింది.  అఫ్గానిస్థాన్‌(Afghanistan)ను తాలిబన్లు చేతిలో ఉండడంతో అంతర్జాతీయ సహాయక సంస్థలు సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది. పైగా ఈ భూకంపం(Earthquake) మారుమూల గ్రామీణ, పర్వత ప్రాంతంలో సంభవించడంతో సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. 

పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో సంబవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైందని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో మట్టి ఇండ్లు ఉండడంతో కొండ చరియలు విరిగి పడడంతో భారీ ప్రాణనష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం(Earthquake)  పాకిస్థాన్‌లో కూడా ప్రభావం చూపింది. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌-పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పలుచోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాబుల్‌లో అఫ్గాన్‌ ప్రధాని మహమ్మద్‌ హసన్‌ అఖండ్‌ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సహాయక సంస్థలు సాయం చేయాల్సిందిగా ట్విట్టర్‌ ద్వారా అర్థించారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం