తగ్గిన వంటనూనెల ధరలు.. ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన వంట నూనెల ధరలు

హైదరాబాద్: వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గడంతో కేంద్రం తీసుకున్న చర్యలతో లీటర్‌ ధర రూ.15 వరకు తగ్గాయి. ఈ నెల మొదటి నుంచి సరాసరి రిటైల్‌ వంటనూనెలు మరింత తగ్గుతునున్నట్లు ఫుడ్‌ కార్యదర్శి సుభాన్షు పాండే తెలిపారు. పల్లి నూనె ధరలు రూ.150 నుంచి రూ.190 మధ్యలోకి  ఆయన వెల్లడించారు. గత వారంలో అదానీ విల్మార్‌, మదర్‌ డెయిర్‌లు వంటనూనె ధరను రూ.10-15 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.  కేవలం వంట నూనెల ధరలే కాకుండా.. ఇతర ఆహార ఉత్పత్తులైన గోధుమ ధరలు కూడా తగ్గాయని ఆయన తెలిపారు. మస్టర్డ్‌ ఆయిల్‌ రూ.180.85కి తగ్గగా, వనస్పతి రూ.165, సోయా ఆయిల్‌ రూ.167కి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.190కి, పామాయిల్‌ రూ.152కి తగ్గాయి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం