దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

కొత్తగా 13,313 మందికి కరోనా

న్యూదిల్లీ: Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి   క్రమంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు ఒక్కరోజే 13,313 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కరోనా బారి నుంచి 10,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81 గా నమోదైంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,33,44,958 
  • మొత్తం మరణాలు: 5,24,941 
  • యాక్టివ్​ కేసులు: 83,990 
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,36,027

కొనసాగుతున్న వ్యాక్సినేషన్ భారత్​లో బుధవారం 14,91,941 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గగా.. మరణాల సంఖ్య పెరిగింది. నిన్న ఒక్కరోజే 7,24,039 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,519 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 546,564,997కు చేరింది. మరణాల సంఖ్య 6,345,548కు చేరింది. ఒక్కరోజే 527,556 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,143,299గా ఉంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం