ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ

ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు

సంగారెడ్డి: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు  తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ట్రానికి  పెట్టుబడులు పెడుతాయని మంత్రి రామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును కేటీఆర్‌ ప్రారంభించారు. జీరో 21 ద్వారా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిక్‌ బైక్‌, త్రీవీలర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం వచ్చిందని, ఈవీల ఉత్పత్తి, వాడకంపై ఆసక్తి పెరుగుతున్నదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో జహీరాబాద్‌లో ఎంజీ పరిశ్రమ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేస్తున్నదని తెలిపారు. నిమ్జ్‌కు ట్రైటాన్‌, వన్‌మోటో లాంటి ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. త్వరలో మహీంద్రా కంపెనీ సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలు, ట్రాక్టర్ల ఉత్పిత్తిని ప్రారంభించనున్నదని వివరించారు. భవిష్యత్తులో ఇతర ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని అన్నారు. జహీరాబాద్‌ ఆటోమొబైల్‌ హబ్‌గా మారుతున్నదని అన్నారు. వచ్చే ఆగస్టులో హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించననున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox