విజయవాడ కనకదుర్గ పైవంతెన కింద మంటలతోపాటు పేలుడు శబ్దం

భయాందోళనకు గురైన వాహనదారులు

విజయవాడ: బెజవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద ఒక్కసారిగా మంటలతో పాటు పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడూ వీఐపీలు తిరిగే ఈ మార్గంలో మంటలు రావడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.ఫ్లైఓవర్‌ కింద ఇంటర్నెట్‌ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్నెట్‌ కేబుళ్లు లాగిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox