కావలసినవి: బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, కారం, వాము – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, ఉప్మా – ఒకటిన్నర కప్పులు
శనగపిండి – ఒక కప్పు, బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం: శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం, వాము (నలిపి వేసుకోవాలి), ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. ఉండలు లేకుండా తోపు సిద్ధం చేసుకోవాలి. రుచికి తగినట్టు పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివి అందులో కలుపుకోవచ్చు. అనంతరం ఉప్మా ఉండల్ని ఆ తోపులో రెండు మూడు సార్లు ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox