సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికిన ప్రవాసులు

న్యూయార్క్ లో పర్యటిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ

అమెరికా: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం న్యూయార్క్​లో అడుగుపెట్టారు. ఈ మేరకు ఉదయం ప్రవాసులు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్రా ఎల్ల, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, తానా ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు ఎన్.వి.రమణకు స్వాగతం పలికారు. ఈ నెల 24న న్యూజెర్సీ, 25న వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ డీసీ ఆధ్వర్యంలో జరగనున్న మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాల్లో జస్టిస్ ఆయన పాల్గొంటారు. అదేవిధంగా సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో జులై 1న అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం