ప్రకాశంజిల్లా: వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసిందని ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెళ్లి కానుక పథకాన్ని నేడు రద్దు చేయడంతో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రకాశంజిల్లా పొదిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యకర్తలు మాట్లాడారు.
మైనార్టీ కులమే మీకు అడ్డం వచ్చిందా, ఎలక్షన్స్ ముందు పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు మండిపడ్డారు. అసలు మేము పెళ్లి కానుక ఇమ్మని అడిగామా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మార్చారని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox