రానున్న ఎన్నికల్లో కూడా నేనే ఎమ్మెల్యే

ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్

ప్రకాశంజిల్లా: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంచి రెస్పాన్స్ ఉందని, ప్రకాశంజిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. తర్వాత ఎమ్మెల్యే కూడా నేనేనని ఆయన తెలిపారు. కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ ప్లీనరీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో పక్క రాష్టాల ఎంపీలు మీ రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలు ఎలా సాధ్యం అవుతున్నాయని అడుగుతున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే బుర్రాని రాబోయే ఎన్నికల లో మంచి మెజారిటీతో గెలిపించండని అన్నారు. కనిగిరి ప్రజలకు మాగుంట ఫ్యామిలీ అంటే మంచి గౌరవమని ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox