రైలు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి.!

అసిస్టెంట్ పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ఉత్తరప్రదేశ్: రైలు నడుపుతున్న క్రమంలో  గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్-కాన్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే... పరశురాంపూర్ చిల్బిలాకు చెందిన రైలు డ్రైవర్ హరిశ్చంద్ర శర్మ (46) ప్రతాప్‌గఢ్-కాన్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్నారు. అయితే కాసింపూర్ హాల్ట్ సమీపంలో ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య ఏర్పడిందని గౌరీగంజ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు. రైలులో ఉన్న అసిస్టెంట్ పైలట్ రైలును ఆపి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అనంతరం హరిశ్చంద్ర శర్మను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రతాప్‌గఢ్‌ నుంచి మరో లోకో పైలట్‌ రావడంతో రైలు అక్కడి నుంచి బయలుదేరింది. ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం