షర్ట్ విప్పితే గుట్టు వీడింది.. రూ.60 లక్షలు హవాలా డబ్బు పోలీసులు స్వాధీనం
ఆంధ్రా నుంచి చెన్నైకు తరలుతున్న హవాలా డబ్బు
చెన్నై: గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు... వారికి మరో విధంగా నేరం బయటపడింది. చెన్నైలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ హవాలా మనీ ఆంధ్రా నుంచి చెన్నైకు తరలుతోంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు లభ్యమైంది. యువకుడి షర్ట్ లోపల సుమారు రూ.30లక్షలు, బ్యాగ్‌లో మరో రూ.30 లక్షలు రైల్వే పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
కాగా, యువకుడు రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్నాడని..కానీ విజయవాడ నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. రైళ్లలో హవాలా మనీ, గంజాయి, మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా చేపట్టిన సోదాల్లోనే భారీగా నగదు పట్టుబడిందని పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox