భారత్ లో కొత్తగా 15 వేలకుపైగా కరోనా(Corona) కేసులు నమోదు

నిన్న 17 వేలకుపైగా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 15 వేలకు తగ్గింది

న్యూదిల్లీ: దేశంలో కరోనా(Corona) కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 17 వేలకుపైగా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 15,940కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,33,78,234కు చేరాయి. కాగా, గత 24 గంటల్లో 20 మంది మరణించగా 12,425 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజాగా నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 4,27,61,481 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా 5,24,974 మంది మరణించారు.

మరో 91,779 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువవడంతో యాక్టివిటీ రేటు 0.21 శాతానికి పెరిగింది. రికరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 196.94 కోట్ల కరోనా(Corona) వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox