రైల్వే స్టేషన్ కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

కలెక్టర్ ను ఆదేశిస్తూఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్: భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనలు తెలుపుతున్న క్రమంలో పోలీసులకు మరియు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో రాకేష్ అనే అభ్యర్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది.

ఈ మేరకు రాకేష్  కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించింది. ఈ రోజు అందుకు అనుగుణంగా ప్రభుత్వం కలెక్టర్ ను ఆదేశిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి రాకేష్ మృతి తర్వాత అంత్యక్రియల నిర్వహణతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ అన్నీ తానై ధైర్యం చెప్పారు. మీకు నేనున్నాననే భరోసా కల్పించారు. అన్నట్టుగానే ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రాకేష్ సోదరుడు రాజుకు ఉద్యోగం అందజేయాలని కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం