దేవినేని ఉమా అవినీతి పరుడు, అసమర్ధుడు: వెల్లంపల్లి శ్రీనివాసరావు

మైలవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా: దేవినేని ఉమా ఇకపై తన జీవితంలో మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేడని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కన్వీనర్, మాజీమంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం మైలవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ....దేవినేని ఉమా అవినీతి పరుడు, అసమర్ధుడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో జరిగే జిల్లా స్థాయి ప్లీనరీకి కూడా అందరూ వైసీపీ శ్రేణులందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్  మాట్లాడుతూ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  మైలవరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేశారని, కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం