శివసైనికుల్లో సహనం నశిస్తోంది : సంజయ్ రౌత్

శివసైనికులు బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని వ్యాఖ్య

ముంబయి: ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. అయితే వారిలో సహనం నశిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒకవేళ వారు బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరి బలం ఎంతో తేలుతుందని సవాల్ చేశారు.  శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox