ఉత్సవంలా ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌

హ‌న్మ‌కొండ‌లో 25వ ఎస్బీఐ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌

వ‌రంగ‌ల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియ‌న్‌కు చెందిన హైద‌రాబాద్ సర్కిల్‌ మీటింగ్ ఇవాళ హ‌న్మ‌కొండ‌లో జ‌రిగింది. అయితే ఇది 25వ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం కావ‌డంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేశారు. యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ప్ర‌తి మూడేళ్లకు ఒక‌సారి జీబీఎం స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ స‌భ‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. గడిచిన మూడు సంత్సరాల పాటు జరిగిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను యూనియ‌న్ నేత‌లు వెల్ల‌డించారు. దేశం నలుమూలల నుండి ఎస్‌బీఐ యూనియ‌న్ లీడ‌ర్లు ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభను ఒక ఉత్సవంలా ఎస్‌బీఐ నిర్వ‌హిస్తోంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం