మొరాకో- స్పెయిన్ సరిహద్దులో ఉద్రిక్తతలు

తొక్కిసలాటలో 18 మంది మృతి

న్యూదిల్లీ: ఆఫ్రికాలోని మొరాకో- స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు నుంచి స్పెయిన్ మెలిల్లాలోకి ప్రవేశించడానికి ఆఫ్రికా వలసదారులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు, వలసదారుల మధ్య హింసాత్మక వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, సుమారు 2,000 మంది వలసదారులు ఎన్‌క్లేవ్‌ను మూసివేసే ఎత్తైన కంచెపై దాడి చేసినట్టు తెలిసింది.  కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం