సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలక
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) శ్రీకాకుళం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రొటోకాల్ జాబితాలో తన పేరు లేదంటూ కేంద్ర మాజీ మంత్రి, వైకాపా నేత కిల్లి కృపారాణి (Killi Krupa Rani) అలిగారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రోటోకాల్ జాబితాలో పేరు లేకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. ఇదేమైనా న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు.
'నా పేరే మర్చిపోయారా..' అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా శాంతించలేదు. చివరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) స్వయంగా కృపారాణి కారు దగ్గరకు వెళ్లి బతిమిలాడారు. అయినా ఆమె శాంతించక అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox