కడప: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయిన ఘటన మంగళవారం మైదుకూరు-ప్రొద్దుటూరు ప్రధాన రహదారిపై జరిగింది. కావలి కొత్తసత్రానికి చెందిన ఆరుగురు గోవాకు కారులో బయలుదేరారు. కాలకృత్యాల కోసం ఏటూరు కాలువ వద్ద కారు ఆపి రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటనలో వినయ్ కుమార్, అశోక్ కుమార్ లకు బలమైన గాయాలయ్యాయి. వీరిని 108 లో పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాపాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox