కరోనా నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా

ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox