26 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి

మంత్రి ఎర్రబెల్లిని కలిసి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో గల 26 గ్రామాలకు శాశ్వత పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. నేడు హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిసి వినతి పత్రం అందించారు. నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీల నిర్మాణాలకు సహకరించాలని మంత్రిని కోరారు. 

గ్రామాల వివరాలు: భీమారం మండలంలోని ఆరేపల్లి, పోలంపల్లి ఖాజీపల్లి, నర్సింగాపూర్,  జైపూర్ మండలం లోని నర్వ, వెంకట్రావుపల్లి, కోటపల్లి మండలం లోని అన్నారం, దేవులవాడ మల్లంపేట్, నాగంపేట్, నక్కలపల్లి, పారుపల్లి, పుల్లగావ్, ఆల్గవ్, రాంపూర్, రొయ్యల పల్లి, షెట్పల్లి, సిర్స, చెన్నూరు మండలంలోని అంగ్రజ్ పల్లి, సుందర శాల, పొక్కూరు, సోమన్ పల్లి, మందమర్రి మండలంలోని పులిమడుగు, ఆదిల్ పేట్, బొక్కల గుట్ట గ్రామాలు ఉన్నాయి.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox