తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ గా మేడె రాజీవ్ సాగర్

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ గా మేడె రాజీవ్ సాగర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా, శిశు, వికలాంగ, సీనియర్ సిటిజన్స్ విభాగంలో తెలంగాణ ఫుడ్స్ పనిచేస్తోంది. ఈ పదవిలో ఆయన రెండెళ్ల పాటు కొనసాగుతారు. ఆయనతో పాటు తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్ గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ లను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox