రన్నింగ్ కారులో మంటలు.. చివరి నిమిషంలో తప్పించుకున్న డ్రైవర్

మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ వద్ద ఘటన

హైదరాబాద్: మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుపై కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.  ఇంజిన్‌ నుంచి మంటలు రావడంతో డ్రైవర్‌ వెంటనే కారులో నుండి బయటకు వచ్చాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఇంజిన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. కారు జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox