వృద్ధాశ్రమం ముసుగులో ఉద్యోగాల దందా.. నిర్వహకురాలిపై పీడీయాక్ట్
అమ్మ వృద్ధాశ్రమం నిర్వహకురాలు రాచమల్ల శ్రీదేవి అరెస్ట్
వరంగల్: వృద్ధాశ్రమం ముసుగులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న వృద్ధాశ్రమ నిర్వహకురాలిపై పోలీసులు పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని కాజీపేట, హన్మకొండ, కేయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాని నిరుద్యోగుల వద్ద లక్షల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న అమ్మ వృద్ధాశ్రమం నిర్వహకురాలు రాచమల్ల శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు.
కాజీపేట ఇన్స్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి నిందితురాలికి ఖమ్మం కారాగారంలో అందజేసి నిందితురాలిని చంచల్ గూడ కారాగారానికి తరలించారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితురాలు తన భర్తకు విడాకులు ఇచ్చి ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తాని లక్షలు వసూళ్లకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కి పీడీ యాక్ట్ తో చర్లపల్లిలో వున్న బానోత్ రాజ్ కుమార్ తో పరిచయం ఏర్పడి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగాలు అభ్యర్థులు పరీక్షల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉ ద్యోగాలు వస్తాయని, అభ్యర్థులు గమనించాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడితే వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox