పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త .. ఈ పరీక్షలో పాస్ అయితే చాలు..

ఏపీ విద్యాశాఖ పదోతరగతి విద్యార్థులకు వెసులుబాటు

అమరావతి: ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల్లో మాత్రం సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పది ఫెయిలయిన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారిని కంపార్ట్ మెంట్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కులు ప్రకారం.. డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. అయితే ఈ విధానం ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తించనుంది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విద్యాశాఖ జూన్ 6న ఫలితాలు విడుదల చేశారు.

కొవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. జూలై 6 నుంచి 15వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సిన రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్‌ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్‌మెంట్‌ పరీక్షల విధానం లేదు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం