హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారికి శుభవార్త...ఎందుకంటే.!

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పై అధికారుల సన్నాహాలు

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే వాహనాదారులకు ప్రభుత్వం  శుభవార్త అందించింది. ఇప్పుడే అందుబాటులోకి వస్తున్న ఈవీ వాహనాల కోసం తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేక ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఇబ్బందులను దూరం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కొన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జీంగ్ స్టేషన్లను కల్పించేందుకు సిద్ధమైంది.

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇక, హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 100 ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ సిటీలో మొదట 14 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు పేలుతుండడంతో వాహనాదారులు భయాందోళనకు గురవుతున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం