హైదరాబాద్‌కు చేరుకున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ పర్యటన

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల  ప్రచారంలో భాగంగా ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  సీఎం కేసీఆర్‌ సైతం ఈ ప్రచారంలో పాల్గొంటుండడం విశేషం.

శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్‌, మం‍త్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ  సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం