భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన ఇరాన్

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 4.6, 4.4, ఆపై 6.0, 6.3గా నమోదు

హైదరాబాద్: ఇరాన్‌‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో కారణంగా ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవాం అర్ధరాత్రి నుంచి శనివారం తిరిగి తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో పలుమార్లు భూమి కంపించింది. హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని  బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ ఝామున వరకు చాలాసార్లు  ప్రకంపనలు సంభవించాయి. ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 4.6, 4.4, ఆపై 6.0, 6.3గా నమోదు అయ్యింది. ఈ భూకంపం తీవ్రత కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.  భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. 

https://twitter.com/LoveWorld_Peopl/status/1543032886021988355?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543032886021988355%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fmassive-earthquake-hits-iran-tremors-also-uae-1467707

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం