భాగ్యనగరం కాషాయమయం... బీజేపీ కార్యవర్గ సమావేశాలకు తరలివస్తున్న నేతలు

జాతీయ నేతలతో నిండిపోయిన నగరం

హైదరాబాద్: భాగ్యనగరం మెుత్తం కాషాయమైంది. నేతలతో నగరం నిండిపోయింది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన  ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో ఉండే సందడి ఇప్పుడే కన్పిస్తోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ... రాష్ట్ర రాజకీయాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. మూడవ రోజు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. 

కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం సిద్దమైంది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గోనున్నారు. దీంతో మినీ ఇండియా లాంటి గ్రేటర్‌ సిటీ ముఖ్య నేతలకు అతిథ్యమిస్తోంది. పార్టీ పతకాలతో అన్ని దారులూ హైటెక్స్‌ వైపే అన్నట్లుగా తీర్చిదిద్దారు. భిన్న సంస్కృతులు..ఆచార వ్యవహారాలు గల భాగ్యనగరంలో గంగా జమునా తహజీబ్‌ లాంటి మిశ్రమ సంస్కృతి ఏళ్లుగా కొనసాగుతున్న తరుణంలో ఇక్కడే సమావేశాల నిర్వహణకు బీజేపీ అధినాయకత్వం ఆసక్తి చూపింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం