నష్టాల్లో మార్కెట్.. లక్షల కోట్ల రిలయన్స్‌ సంపద ఆవిరి

ఇంధన షేర్లు పతనంతో నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: టాప్ రేటెడ్ రిలయన్స్‌తో పాటు ఇంధన షేర్లు పతనంతో స్టాక్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. జూన్‌లో తయారీ రంగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకోవడం వంటి సెంటిమెంట్‌ కారణంగా షేర్లు ఒత్తిడి గురయ్యాయి. ట్రేడింగ్‌లో భారీ నష్టాల్లో ఉన్న సూచీలు చివరకు ఓ మోస్తారు నష్టాలతో ముగిశాయి. అరంభంలో  925 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌ చివరికి 111 పాయింట్ల నష్టంతో 52,907 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 269 పాయింట్ల పతనం నుంచి కోలుకోని 28 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద నిలిచింది.

కేంద్ర విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో  దేశ వ్యాఫారంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చూసింది. ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.2365 వద్ద స్థాయిని తాకింది. చివరికి ఏడుశాతం నష్టంతో రూ.2409 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో రూ.1.25 లక్షల కోట్ల కంపెనీ సంపద ఆవిరైంది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం