దేశంలో ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు!.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

కొత్తగా 15 వేలకు పైగా కరోనా కేసులు

న్యూదిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. డెయిలీ పాజిటివిటీ రేటు కూడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదు అయ్యాయి. శుక్రవారం 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకుంది. కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. 

టెస్టుల సంఖ్య పెంచితే.. మరిన్ని కేసులు బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కావున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది.

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం