హైదరాబాద్: తాజాగా టెట్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 17న ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీచేసేందుకు ఆమోదముద్ర లభించింది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు శుక్రవారం వెల్లడికావడంతో త్వరలో నోటిఫికేషన్లు వెలబడనుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హత తప్పనిసరి కాబట్టి తెలంగాణ వచ్చాక 2016 మేలో, 2017 జూలైలో టెట్ నిర్వహించారు. ఆ టెట్ వ్యాలిడిటీ ఏడేండ్ల పాటు ఉండగా, ఇటీవలే దానిని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో క్వాలిఫై అయి న వారికి సమస్య లేకుండా పోయింది.

Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox